ఫిజియోథెరపిస్టులు మెడికల్ డాక్టర్లు కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) స్పష్టం చేసింది. వారి పేర్ల ముందు ‘డాక్టర్’ అనే పదాన్ని వాడరాదని హెచ్చరించింది. అలా చేస్తే ఇండియన్ మెడికల్ డిగ్రీస్ యాక్ట్ - 1916 ఉల్లంఘన అవుతుందని డీజీహెచ్‌ఎస్ డాక్టర్ సునీత శర్మ సెప్టెంబర్ 9న జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ఫిజియోథెరపిస్టులు వ్యాధులను స్వయంగా నిర్ధారించలేరని, ప్రైమరీ కేర్ ప్రాక్టీస్ చేయరాదని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa