కాంగోలో రెండు పడవ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం సాయంత్రం లుకోలెలా ప్రావిన్స్‌లోని కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మంటల్లో చిక్కుకుని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 107 మంది మృతి చెందగా, 146 మంది గల్లంతయ్యారు. మరోవైపు ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 193 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa