ఏపీ హైకోర్టు రద్దు చేసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘జగన్ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పరీక్షను రద్దు చేస్తూ మెయిన్స్‌ను తిరిగి నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. అయితే, కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది’ అని ఆయన విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa