జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతిపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జైపూర్‌లోని కల్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నివేదికల ప్రకారం, ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగిందని తెలుస్తోంది. నిందితుడు తన స్నేహితురాలిని ఆమె సోదరుడి ఇంట్లో చూసి, ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.
అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. అయితే, ఇటీవల ఈ విషయం యువతి సోదరుడికి తెలియడంతో ఆయన నిందితుడిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన నిందితుడు యువతి సోదరుడిపై దాడికి తెగబడ్డాడు.
ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన యువతి సోదరుడు నిందితుడిపై కల్వార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa