ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మరో 12 కొత్త ఫండ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో పాటుగా 3 స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఎస్ఎఫ్ఐ)లు సైతం ఉన్నాయి. ఇప్పటికే పలు స్కీమ్స్ సబ్‌స్క్రిప్షన్ మొదలైంది. తమ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న గ్యాప్స్ పూరించేందుకు కొత్త స్కీమ్స్ లాంచ్ చేస్తున్నట్లు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ప్రకటించాయి. న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా మార్కెట్లకు కొత్త తరం ఫండ్స్ తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాయి. మరి ఏ స్కీమ్ ఎప్పుడు వస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
ఎస్ఎఫ్ఐ స్కీమ్స్
క్యూసిఫ్ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైంది. అక్టోబర్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇక అల్టివా హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్, మ్యాగ్నమ్ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
కోటక్ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఈటీఎఫ్, డీఎస్‌పీ నిఫ్టీ 500 ఫ్లెక్సీ క్యాప్ క్విలిటీ 30 ఈటీఎఫ్ స్కీమ్స్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 6వ తేదీతో ముగుస్తోంది. జిరోధా నిఫ్టీ 50 ఈటీఎఫ్ సబ్‌స్క్రిప్షన్ 10వ తేదీతో ముగుస్తుంది.
వాటితో పాటుగా జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ద వెల్త్ కంపెనీ ఫ్లెక్సీ క్యాప్ పండ్ సబ్‌స్క్రిప్షన్స్ వరుసగా అక్టోబర్ 7వ తేదీ, అక్టోబర్ 8వ తేదీల్లో ముగుస్తున్నాయి. సెక్టోరల్ ఫండ్ కేటగిరీలో మోతీలాల్ ఓస్వాల్ కన్సంప్షన్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా కన్సంప్షన్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 15, 17వ తేదీల్లో ముగుస్తున్నాయి. ద వెల్త్ కంపెనీ ఎథికల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రూ కాంగ్లమరేట్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 9, 17 తేదీల్లో ముగుస్తున్నాయి. ద వెల్త్ కంపెనీ ఆర్బిట్రేజ్ ఫండ్, ద వెల్త్ కంపెనీ లిక్విడ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 8వ తేదీన ముగుస్తుంది. జిరోధా నిఫ్టీ 50 ఇండెక్స్ పండ్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తుంది. ఈ ఫండ్ హౌస్ అందిస్తోన్న ఏకైక డైరెక్ట్ ప్లాన్ ఇదే.
మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. ఈ కథనం కేవలం సమాచారం అందించేందుకే. కానీ, ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. అలాగే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు న్యూ ఫండ్ ఆఫర్‌కి దూరంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోవచ్చు. గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులో వస్తాయని గ్యారెంటీ ఉండదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa