ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.ఈరోజు (సోమవారం) ఆర్టీవీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కోమటికుంట దగ్గర బస్సు అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులు బస్సు దిగి వేరే వాహనాలలో తమ ప్రయాణాన్ని సాగించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa