నేపాల్‌ను మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, భూకంపం తీవ్రత స్వల్పంగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నివేదికలు తెలుపుతున్నాయి. నేపాల్‌లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి, 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa