ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం ప్రకటించారు. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామం పేరును 'కబీర్ ధామ్'గా మార్చనున్నట్లు సోమవారం వెల్లడించారు. లఖింపూర్ ఖేరిలోని విశ్వ కళ్యాణ్ ఆశ్రమంలో జరిగిన 'స్మృతి ప్రకటోత్సవ మేళా'లో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఇక్కడికి వచ్చాక ఈ గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తెలిసింది. ఇక్కడ ముస్లిం జనాభా ఎంత అని అడిగినప్పుడు, ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదని చెప్పారు. అందుకే ఈ గ్రామం పేరును 'కబీర్ ధామ్'గా మారుస్తామని నేను హామీ ఇచ్చాను" అని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పేరు మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa