దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ దాడికి సూత్రధారి బాధితురాలి తండ్రేనని తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తనపై నమోదైన అత్యాచారం కేసు నుంచి తప్పించుకునేందుకు, ప్రత్యర్థిని ఈ కేసులో ఇరికించేందుకు కన్న కూతురితో కలిసి ఈ నాటకం ఆడినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆదివారం నార్త్ ఢిల్లీలోని అశోక్ విహార్లో తనపై జితేందర్ అనే వ్యక్తి, అతడి స్నేహితులు ఇషాన్, అర్మాన్లు యాసిడ్తో దాడి చేశారని డీయూ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బాధితురాలి తండ్రి అకిల్ ఖాన్ను విచారించగా అసలు నిజం బయటపడింది. జితేందర్ భార్య తనపై అత్యాచారం కేసు పెట్టడంతో, అతడిపై కక్ష తీర్చుకునేందుకు ఈ దాడి నాటకం ఆడినట్లు అకిల్ ఖాన్ అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని సోమవారం అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa