ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతమందికి కనిపించిన బైక్ ప్రమాదం జరిగిన బస్సు డ్రైవర్ కి కనబడలేదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 04:09 PM

కర్నూలు సమీపంలో 19 మందిని బలిగొన్న బస్సు ప్రమాద ఘటనలో విచారణ వేగవంతమైంది. డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముందు కేవలం 10-15 నిమిషాల వ్యవధిలో అదే మార్గంలో ప్రయాణించిన 19 భారీ వాహనాలు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను గుర్తించి, దానిని తప్పించుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, అంతమందికి కనిపించిన బైక్ కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు ఎందుకు కనిపించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. గత శుక్రవారం తెల్లవారుజామున 2:45 గంటలకు శివశంకర్, ఎర్రిస్వామి అనే ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై వెళ్తూ చిన్నటేకూరు వద్ద డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎర్రిస్వామి గాయపడ్డాడు. వారి బైక్ రోడ్డు మధ్యలోనే పడిపోయింది. సరిగ్గా 10-15 నిమిషాల తర్వాత, అంటే 2:55 నుంచి 3 గంటల మధ్య, బెంగళూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఉన్న బైక్‌ను గుర్తించకుండా పైనుంచి దూసుకెళ్లింది. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుని, ఘర్షణకు గురై మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa