జీవశాస్త్రం, హార్మోన్ల మార్పుల కారణంగా మహిళల్లో థైరాయిడ్, PCOS, ఆటోఇమ్యూన్ వ్యాధులు, ఆస్టియోపొరోసిస్, రక్తహీనత వంటి వ్యాధులు పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. PCOS మహిళల్లో సాధారణ హార్మోన్ల సమస్య, దీనివల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు వంటివి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 70% మంది మహిళలకు తమకు PCOS ఉందని తెలియదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, సరైన ఆహారం, లక్షణాలను నిర్లక్ష్యం చేయకపోవడం ద్వారా ఈ వ్యాధులను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa