గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాసిర్ సూచించారు. శుక్రవారం స్థానిక తూర్పు శాసనసభ్యుల కార్యాలయంలో ఎండోమెంట్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. లాలాపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3.6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైలు పేటలోని ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa