కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం శ్రీభక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కనకదాస సమానత్వం, మానవత్వం కోసం చేసిన సేవలు ఆదర్శనీయమని, పోలీసులు కూడా వివక్ష లేకుండా ప్రజలకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పోతల రాజు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa