సూది రహిత నాసల్ స్ప్రే ఫ్లూ వ్యాక్సిన్‌ను యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOHAP) దేశంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా విడుదల చేయడంతో, ఇంజెక్షన్ల వల్ల కలిగే నొప్పికి భయపడే పిల్లలకు, పెద్దలకు ఇది నిజంగా శుభవార్త. ఈ నీడిల్ ఫ్రీ వ్యాక్సిన్, సురక్షితమైన, సులభమైన రోగనిరోధకత ఎంపికలను విస్తరించడంలో ఒక ప్రధాన ముందడుగు. ఇది సాంప్రదాయ ఫ్లూ షాట్‌కు త్వరిత, నొప్పి లేని ప్రత్యామ్నాయాన్ని అందిస్తూ, 2 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులైన వారి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ ఫ్లూమిస్ట్ క్వాడ్రివలెంట్ (లేదా LAIV) వ్యాక్సిన్ ద్వారా లక్షలాది మంది పౌరులకు సులభంగా, వేగంగా వ్యాక్సిన్ ఇచ్చే వెసులుబాటు వచ్చింది. ఈ అభివృద్ధి టీకా కవరేజీని పెంచడానికి UAE చేపట్టిన వ్యూహాత్మక ప్రయత్నంలో ఒక భాగం. ఈ టీకాను ముక్కు రంధ్రాల్లోకి సులభంగా స్ప్రే చేయవచ్చు. 2 నుండి 17 సంవత్సరాల ఆరోగ్యకరమైన పిల్లలు, 18 నుండి 49 సంవత్సరాల ఆరోగ్యకరమైన పెద్దలు ఈ టీకాకు అర్హులు. తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సాధారణంగా ఒకే మోతాదు (రెండు స్ప్రేలు) సరిపోతుంది, అయితే ఇంతకు ముందు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోని 2 నుండి 8 సంవత్సరాల పిల్లలకు రెండు మోతాదులు అవసరం కావొచ్చు. కాగా, ఈ నాసల్ స్ప్రే అందరికీ తగినది కాదు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు, 50 ఏళ్లు పైబడిన పెద్దలు, గర్భిణులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, తీవ్రమైన ఆస్తమాతో బాధపడేవారు, మరియు కొన్ని రకాల అలర్జీలు ఉన్నవారు ఈ టీకా తీసుకోవడానికి అనర్హులుగా ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండే వారు నాసల్ స్ప్రేకు బదులుగా ఇంజెక్షన్ వ్యాక్సిన్‌ను ఉపయోగించడం ఉత్తమం అని అధికారులు సూచించారు. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం UAE అంతటా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa