ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అవ్వగానే మంచి ఫుడ్ తీసుకోవడమనేది చాలా ముఖ్యం. కేవలం వారి తల్లీ ఆరోగ్యమే కాకుండా వారి కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అందుకే, సరైన ఫుడ్స్ తీసుకోవడం మంచిది. బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్, డెయిరీ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పిల్లలకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇందులో ఒక్కో రకం ఫుడ్ ఒక్కో పోషకాలని అందిస్తాయి. అందులో భాగంగా కడుపులోని బిడ్డ ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తింటే మంచిదో చెబుతున్నారు డైటీషియన్ ఇందు. ఆవిడ ప్రకారం, కొన్ని పుడ్స్ తినడం వల్ల పిల్లల్లో ఎముకల ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. ఎముకలు బలంగా మారి ఎదుగుదల బాగుంటుంది. ఇది తల్లీకి, తల్లీ కడుపులోని బిడ్డకి కూడా మంచివి. మరి ఆ ఫుడ్స్ ఏంటంటే
రాగులు
రాగులు ప్రెగ్నెన్సీలో తినడం ఎంతో మంచిది. ఇందులో కాల్షియంతో పాటు ఐరన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కడుపులోని బిడ్డ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా, అనీమియా, జీర్ణ సమస్యలు లేకుండా చేస్తాయి. ఇందులోని లో గ్లైసెమిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని మ్యానేజ్ చేస్తాయి. అయితే, వీటిని అలానే పచ్చిగా తీసుకోకుండా ఉడికించి తీసుకోండి.
నట్స్
నట్స్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా మంచివి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బిడ్డ బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచివి. వాల్‌నట్స్, ఆల్మండ్స్, జీడిపప్పు, పల్లీలు వంటివి తినాలి. ఇందులో ఫొలేట్, జింక్, ఫైబర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెల్దీ ప్రెగ్నెన్సీకి చాలా మంచివి. అయితే, తక్కువ మోతాదులో తినాలి. దీంతో పాటు ప్లెయిన్‌గా తీసుకోవాలి. ఉప్పుతో కలిపి వేయించి తీసుకోవడం మంచిది కాదు.
పెరుగు
పెరుగు కూడా ప్రెగ్నెన్సీలో మంచిది. ఇందులో పాశ్చురైజ్డ్ మిల్క్‌తో తయారైన పెరుగుని తీసుకుంేట ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవన్నీ బిడ్డ ఎదుగుదలకి చాలా మంచిది. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గిస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్‌ని బలంగా మారుస్తాయి. ఇందులోని కాల్షియం బిడ్డ ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, పంచదార లేని పెరుగు తీసుకోవడం మంచిది.
అంజీర్
అంజీర్ కూడా ప్రెగ్నెన్సీలో చాలా మంచివి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మలబద్ధకం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇందులోని ఐరన్ కారణంగా అనీమియా రాకుండా ఉంటుంది. ఇందులోని కాల్షియం, మెగ్నీషియంలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.రోజుకి రెండు లేదా 4 తినడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే ఇందులోని పంచదార శాతం మంచిది. డ్రై అంజీర్‌ని నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. దీంతో జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. అంజీర్‌లోని కాల్షియం బిడ్డ ఎదుగుదలకి చాలా మంచిది.
కడుపులోని బిడ్డ ఎముకల ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్
పెసలు
పెసల్లో కూడా పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఫోలేట్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్‌లు ఉంటాయి. వీటితో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఈ లాభాలని పొందేందుకు రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. దీని వల్ల రక్తహీనత, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిని మనం ఎలా అయినా తీసుకోవచ్చు. సూప్‌లా, స్ప్రౌట్స్‌లా చేసుకుని తినొచ్చు. నానబెట్టి సలాడ్స్, స్టిర్ ఫ్రైలో కూడా వేసుకుని తినొచ్చు. వీటి వల్ల బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
పాలకూర
పాలకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు ఫోలేట్, ఐరన్, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తానికి చాలా మంచిది. అంతేకాకుండా బేబి బ్రెయిన్, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుకూరని తీసుకునే ముందు దానిని చక్కగా కడిగి వాడుకోవడం మంచిది. గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa