కర్నూలు జిల్లాలోని గణేకల్లు గ్రామస్థులు తమ గ్రామాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద హరివాణం మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం మాధవరం రోడ్డుపై భారీ ఆందోళన చేపట్టారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఈ విలీనం చేయడం అన్యాయమని నిరసనకారులు తెలిపారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విలీన ప్రయత్నాలు కొనసాగితే నిరాహార దీక్షలు చేస్తామని గ్రామస్థులు పరమేశ్ నాయుడు, బంగారయ్య హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa