తిరుపతి జిల్లాలోని చిల్లకూరు జాతీయ రహదారిపై శబరిమల వెళ్తున్న అయ్యప్ప భక్తుల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. గుంటూరు నుంచి 35 మంది భక్తులు ప్రయాణిస్తుండగా, చిల్లకూరు వద్ద డ్రైవర్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శౌర్యన్ ట్రావెల్స్ కు చెందిన బస్సుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa