ఆధార్–పాన్ లింక్ చేయని వారికి బిగ్ అలర్ట్. డిసెంబర్ 31లోపు లింక్ చేయకపోతే జనవరి 1 నుంచి పాన్ కార్డు నిష్క్రియంగా మారుతుందని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. దీంతో ఐటీ రిటర్నులు, రీఫండ్లు, బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. పాన్ నిష్క్రియమైతే TDS/TCS ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. కేవైసీ సమస్యలతో బ్యాంక్ ఖాతాలు కూడా నిలిచిపోవచ్చు. CBDT మార్గదర్శకాలు ప్రకారం ఆధార్ ఎన్రోల్మెంట్ IDతో పాన్ పొందినవారు డిసెంబర్ లోపే లింక్ చేయడం తప్పనిసరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa