ఇండిగో విమానయాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. పౌర విమానయాన ప్రయాణికుల భద్రత కోసం ఏడాదిన్నర కిందట కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను ఇండిగో పాటించడంలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంక్షోభంపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించి కొన్ని నిబంధనలకు మినహాయింపు ఇచ్చారు. అయితే కొందరు దీనిని రామ్మోహన్ నాయుడుపై విమర్శలకు వాడుకుంటున్నారు. ఒక ప్రైవేటు సంస్థపై అధికంగా ఆధారపడటం ఇలాంటి సంక్షోభాలకు దారితీస్తుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa