భారత్ ను రష్యా కలిసి చెన్నై నుండి వ్లాడివోస్టోక్ వరకు 5,647 నాటికల్ మైళ్ల ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ (EMC) ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కొత్త సముద్ర మార్గం ప్రయాణ సమయాన్ని 12-15 రోజులు తగ్గిస్తుంది. ఖర్చులను 20-25% ఆదా చేస్తుంది. రష్యాలోని వ్లాడివోస్టోక్‌లో చమురు, సహజ వాయువు, బొగ్గు, కలప, అరుదైన ఖనిజాలు వంటి విలువైన వనరులు పుష్కలంగా ఉన్నాయి, దీనికి భారత్ తక్కువ రవాణా ఖర్చుతో నేరుగా ప్రాప్యత పొందగలదు. దక్షిణాసియా వ్యాప్తంగా వాణిజ్య అనుసంధానాన్ని బలపరుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa