కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్‌లో ఉండే అద్దేపల్లి కాంప్లెక్స్‌లో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. సెల్‌ఫోన్ షాపులో తొలుత చెలరేగిన మంటలు.. ఆ తర్వాత మిగతా దుకాణాలకు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదంలో కోటి రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa