ఉత్తరాంధ్ర జిల్లాలపై జనసేన పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఈ ప్రాంతం నుంచే ఆ పార్టీకి ఎక్కువ అభిమానం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన గెలిచిన 21 అసెంబ్లీ సీట్లలో 6 ఈ మూడు జిల్లాల నుంచే వచ్చాయి. ఆ పట్టును రెట్టింపు చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. నాగబాబు ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండతో పాటు ఎచ్చెర్ల, పాతపట్నం సీట్లపై జనసేన కన్నేసినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa