దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 28 అర్ధరాత్రి నుంచి పరిస్థితులు దిగజారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగమంచుతో కప్పబడి, కొన్నిచోట్ల విజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువగా నమోదైంది. దీంతో పాటు ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పొగమంచు ప్రభావంతో రోడ్డు, రైలు, విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa