న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం అర్ధరాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) మాన్హట్టాన్లోని ఓ చారిత్రక సబ్వే స్టేషన్లో ఖురాన్పై ప్రమాణం చేసి, తొలి ముస్లిం మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు (అమెరికా కాలమానం ప్రకారం) యూఎస్ సెనేటర్ బెర్నీ సాండర్స్ చేతులమీదుగా మరోసారి బహిరంగ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa