తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీపై నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. కనిమొళి కరుణానిధి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, కమిటీ సభ్యుడిగా ఆయన హాజరయ్యారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఆహార ధాన్యాల రవాణా, రైల్వేల ద్వారా రవాణా ఆప్టిమైజేషన్ అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఎఫ్‌సీఐ చైర్మన్, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, సదర్న్ రైల్వే జీఎం, తమిళనాడు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa