AP: రాష్ట్రంలో తరచూ సంభవిస్తున్న తుఫానుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు, తీరప్రాంతాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, 50% గ్రీన్ కవర్' ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుల కింద, తీరప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పున మాంగ్రూవ్స్, సరుగుడు, ఈత చెట్లను నాటనున్నారు. జనవరి నెలాఖరు నాటికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa