కాకినాడ రూరల్లో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపన కోసం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉదయం 11:30 గంటలకే చేరుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు రాకలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం కావడంతో పవన్ గంటన్నరపాటు ప్లాంట్ కార్యాలయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ప్లాంటుకు ఇద్దరు నేతలు కలిసి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa