ఇస్లాం పేరుతో పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేశారని, అయితే ఏ లక్ష్యంతో దేశాన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం త్వరలోనే నెరవేరనున్నట్లు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అన్నారు. లాహోర్‌లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఏర్పాటుకు అల్లా ఒక చారిత్రాత్మక సందర్భాన్ని కల్పించారని, ఏ లక్ష్యంతో ఈ దేశాన్ని ఏర్పాటు చేశారో, ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బలపడిందని, ప్రపంచవ్యాప్తంగా పాక్ ర్యాంకు కూడా మెరుగుపడినట్లు ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తోందని, అది ఒక్క వ్యక్తికి కాదని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa