దేశంలోని కోట్లాది మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను సులభతరం చేస్తూ సరికొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ సర్వీసులు మరింత ఈజీగా, భద్రంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయని తెలిపింది. ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ఆధార్ కొత్త యాప్ లాంచ్ చేసి జాతికి అంకితం ఇచ్చారు. 2009లో ఇదే రోజు అంటే జనవరి 28వ తేదీనే తొలిసారి ఆధార్ లాంచ్ చేయడం విశేషం. మరి ఈ కొత్త యాప్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ ఆధార్ కొత్త యాప్‌ని యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ మెనూలోకి వెళ్లి యాప్‌పై క్లిక్ చేస్తే అడిగే కెమెరా, ఎస్ఎంఎస్ కాల్స్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ ద్వారా ఫోటోలు తీసేందుకు, వీడియోలు రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. నోటిఫికేషన్స్ కావాలంటే ఓకే చెప్పాలి. ఈ యాప్ ద్వారా కాల్స్, మెసేజ్‌లు సైతం చేయవచ్చు. అందుకు సైతం అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత యాప్ ముఖ్యమైన ఫీచర్లు స్లైడ్స్ రూపంలో కనిపిస్తాయి.
దీని తర్వాత యాప్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలి. ఇది మూడంచెల ప్రక్రియ మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను నమోదు చేసి కన్ఫామ్ చేసి టర్మ్స్ అండ్ కండీషన్స్‌పై క్లిక్ చేసి ఓకే చేయలి. ఒక వేళ మీ ఫోన్లో రెండు సిమ్ కార్డ్స్ ఉంటే రిజిస్ట్రేషన్ ఏ ఫోన్ నంబర్‌తో చేయాలి అని అడుగుతుంది. ఓటీపీ ఆటోమేటిక్ గా తీసుకుని ప్రక్రియను పూర్తవుతుంది. ఆ తర్వాత ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. కళ్లద్దాలు పెట్టుకోకూడదు. ఆరు అంకెల పిన్ రెండు సార్లు నమోదు చేసి పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి. దీంతో యాప్ లో మీ ఆధార్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. అలాగే టాప్‌లో ఉన్న యాడ్ ప్రొఫైల్ బటన్ పై క్లిక్ చేసి మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డును కూడా యాప్‌లో యాడ్ చేసుకోవచ్చు.
ఫీచర్లు ఇవే
ఈ యాప్ ద్వారా వెంటనే ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు
అడ్రస్ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకునే సౌలభ్యం ఉంది
ఆధార్ కాంటాక్ట్ కార్డ్ ద్వారా అత్యంత గోప్యంగా కాంటాక్ట్ వివరాలు పంచుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేస్తే మొత్తం వివరాలు కాకుండా అవసరమైన వివరాలు మాత్రమే కనిబడేలా ఏర్పాటు చేయవచ్చు.
ఎలాంటి సంక్లిష్టత లేకుండా యూజర్లకు అందుబాటులో సేవలు ఉంటాయి.
ఈ యాప్ ద్వారా కుటుంబంలోని ఐదుగురి వరకు ప్రొఫైల్ వివరాలు క్రియేట్ చేసుకోవచ్చు.
యాప్ లోని డౌన్లోడ్ ఆధార్ బటన్ క్లిక్ చేసి మాస్క్డ్, అన్మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్స్ బటన్ క్లిక్ చేసి లాక్ అన్‌లాక్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌ను ఇంగ్లీష్, తెలుగుతో పాటు మొత్తం 14 భాషల్లో వాడుకోవచ్చు.
మెనూ బటన్ క్లిక్ చేసి ప్రొఫైల్ లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa