మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఆయన భార్య సునేత్ర పవార్ ఆ పదవిని చేపట్టే అవకాశాలున్నాయని, దీంతో ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ స్థానం ఖాళీ అవుతుందని, ఆ స్థానానికి కుమారుడు పార్థ్ పవార్‌ను పంపించే అవకాశం ఉందని ఎన్సీపీ వర్గాల సమాచారం. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని పార్థ్ భర్తీ చేయనున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. పార్థ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇదిలాఉండగా.. ముంబయిలో నేడు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. ఇందులో సునేత్రను శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేస్తారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa