రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు, 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.24,250 నుండి రూ.53,550 వరకు వేతనం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 4 లోపు rbi.org.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa