సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు వారిద్దరూ కీలక అంశాలపై చర్చించారు. కుల రాజకీయాలను వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు నేతలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. త్వరలో ఖాళీకానున్న 4 రాజ్యసభ స్థానాలపైనా చంద్రబాబు, పవన్ ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది.కుల రాజకీయాలను వైకాపా రెచ్చగొడుతోందని.. ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు, ఆ పార్టీ ట్రాప్లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నేతలిద్దరూ నిర్ణయానికి వచ్చారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కిందిస్థాయిలో తెదేపా, జనసేన క్యాడర్ మధ్య చిచ్చుపెట్టేలా వైకాపా చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa