టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్రీడల్లోకి రాజకీయాలు ప్రవేశిస్తే నష్టపోయేది ఆట మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ నుంచి తప్పుకోవాలని పాక్ ప్రభుత్వం తమ జట్టును ఆదేశించిన నేపథ్యంలో లలిత్ మోదీ మాట్లాడారు.పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదాయానికి, బ్రాడ్కాస్టర్ల నమ్మకానికి గండి పడుతుందని లలిత్ మోదీ హెచ్చరించారు. "ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నీల ప్రసార హక్కుల విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి అనిశ్చితి వల్ల స్పాన్సర్లు వెనకడుగు వేస్తారు. ఈ గందరగోళంలో చివరకు లబ్ధి పొందేది ఐపీఎల్ మాత్రమే. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్ ఒక బ్రాండ్‌గా ఎదిగింది. ఇప్పుడు ఇలాంటి బహిష్కరణలు దానికి మరింత బలాన్ని ఇస్తాయి" అని విశ్లేషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa