పొగాకు రైతులు, చిరు వ్యాపారుల దశాబ్దాల కల నెరవేరింది. ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ నిర్ణయం వల్ల పొగాకు వాణిజ్యంలో పారదర్శకత పెరగడమే కాకుండా, సామాన్య రైతులకు మెరుగైన ధర లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.గతంలో బ్రాండ్ లేని ముడి పొగాకు విక్రయాలపై సరైన నిబంధనలు లేకపోవడంతో అధికారులు, రైతుల మధ్య తరచూ వివాదాలు తలెత్తేవి. పన్ను ఎగవేత ఆరోపణలతో రైతులు ఇబ్బందులు పడేవారు. తాజా గెజిట్ (HS కోడ్ 2401) ద్వారా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.రైతులు సంచుల్లో విక్రయించే ముడి పొగాకు, ప్యాకింగ్ లేని రీటైల్ విక్రయాలపై ఎలాంటి పన్ను ఉండదు. కంపెనీ బ్రాండ్ పేరుతో ప్యాక్ చేసిన పొగాకు, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మే ఉత్పత్తులపై మాత్రం 18 శాతం ఎక్సైజ్ సుంకం కొనసాగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa