సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను చంద్రబాబు తప్పుబట్టడం సరికాదని జగన్ అన్నారు. చంద్రబాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వ సంస్థ సీబీఐ ఇచ్చిన నివేదిక తనకు అనుకూలంగా రాలేదంటే, చంద్రబాబు వాదన ఎలా సరైనదవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను సమర్థించుకోవడానికే కమిషన్ వేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు.తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేది చంద్రబాబు ఆడుతున్న పచ్చి అబద్ధమని, దీనిని సీబీఐ రిపోర్ట్ సైతం తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్‌ఐ వంటి కేంద్ర సంస్థలు ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశాయని గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచేలా చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa