రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న విధానాన్ని తీసుకువస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని భావిస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులు తీసుకోకపోవడం లేదా అక్రమంగా విక్రయిస్తున్నారని ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీలల్ ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ సహకారంతో ఈ-రూపీ అనే డిజిటల్ వోచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ప్రతి నెలా వోచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ వోచర్‌తో రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా కూడా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa