భారత్ నుండి వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోవడంతో పాకిస్తాన్ తీవ్రమైన వ్యాక్సిన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం నిధుల కొరత మాత్రమే కాదు, వ్యవస్థాగత వైఫల్యం కూడా.. రాజకీయ విద్వేషాలు, రక్షణ రంగంపై అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆరోగ్య రంగం నిర్లక్ష్యానికి గురైంది. దీనివల్ల ఇంపోర్ట్ బిల్లు భారీగా పెరగడంతో పాటు, మీజిల్స్, న్యూమోనియా, పోలియో వంటి వ్యాధులతో చిన్నారులు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు. జీఏవీఐ సంస్థ సాయం తాత్కాలికమేనని, 2030 తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా భరించాల్సి ఉంటుందని, ఇది ఆ దేశ ఆర్థిక స్థితికి భారంగా మారుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.దశాబ్దాలుగా రక్షణ రంగంపై పెట్టిన శ్రద్ధలో పదో వంతు కూడా ఆరోగ్య రంగంపై పెట్టకపోవడంతో కనీసం ఒక చిన్న వ్యాక్సిన్‌ను కూడా సొంతంగా తయారు చేసుకునే స్థితిలో ఆ దేశం లేదు. మీజిల్స్ కేసులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం.. ఏడాదికి 90 వేల మందికి పైగా చిన్నారులు న్యూమోనియాతో చనిపోతుండటం ఆ దేశ పాలకుల వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రపంచమంతా పోలియో రహితంగా మారుతుంటే పాకిస్తాన్ ఇంకా ఆ మహమ్మారి కోరల్లోనే ఉంది. వ్యాక్సిన్లపై ఉన్న మూఢనమ్మకాలు, హెల్త్ వర్కర్లపై దాడులు ఆ దేశాన్ని వెనక్కి నెడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa