ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్‌ షాపుల్లో రూ.20కే కేజీ గోధుమ పిండి: మంత్రి మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 03:32 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త అందించారు. గుంటూరు జిల్లా తెనాలిలో రూ.20కే కిలో గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రేషన్‌కార్డులు ఉన్నవారికి నాణ్యమైన సరుకుల్ని అందిస్తున్నామని, కిలో గోధుమ పిండి రూ.20కే అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం కిలో రేషన్ బియ్యంపై రూ.47.10 ఖర్చు చేస్తోందని, పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే రేషన్ బియ్యం ఆరోగ్యానికి మంచివని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమపిండిని పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గోధుమ పిండిని రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో రేషన్‌ పంపిణీ విధానం దారుణంగా ఉందని.. ఈ వ్యవస్థ కొందరికే ఉపయోగపడిందన్నారు. రేషన్ కార్డుల్ని ఫొటోలు, రంగులతో నింపేపేశారని.. అదేదో సొంత కార్యక్రమంలా చేసుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాలశాఖను ప్రక్షాళన చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa