పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి చెందిన 25 మంది జనసేన, తెలుగుదేశం పార్టీ లకు చెందిన కార్యకర్తలు ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో మారంపల్లి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు మంగిన బాలాజీ (బాలు) తన అనుచరులతో కలసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వడ్డి రఘురామ్ నాయుడు క్రొత్తగా పార్టీలోకి చేరిన కార్యకర్తలకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు మంగిన బాలాజీ తెలిపారు.ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలనుంచి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభసూచకమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక స్థానం, ప్రత్యేక గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మిద్దె శివ, మేక సాయి, కరింకి దుర్గాప్రసాద్, కనపర్తి సురేష్, కనపర్తి వెంకన్న, ఆదిరెడ్డి దుర్గారావు, పసలపూడి నాగేశ్వరరావు, సుంకర చంద్రశేఖర్, కొండపల్లి కనకం,ఇందుకూరి శ్రీనివాస రాజు, సారిక సత్యనారాయణ, ఉత్తరవల్లి నాగు, నందమూరు మాజీ సర్పంచ్ దానయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa