ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య వివాదం రేగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరూ గొడవ పడ్డారు. అందులో ఓ యువతి కోపం పట్టలేక కాల్పులు జరిపింది. బుల్లెట్ గాయంతో ఓ యువతి మరణించింది. ముంబైలోని శివాజీనగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..శివాజీ నగర్ కు చెందిన షిఫా షేక్ (19) స్థానికంగా నివాసం ఉండే ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఆ యువకుడు అప్పటికే మరో యువతి(25)తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అటు ఆ బంధం కొనసాగిస్తూనే షిఫాతోనూ ప్రేమ మొదలుపెట్టాడు. ఈ విషయం బయటపడడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం షిఫా షేక్ కు ఆ యువతి ఫోన్ చేసి మాట్లాడాలని ఫుర్కానియా మసీదు వద్దకు పిలిచింది.అక్కడ ఇద్దరూ తమ ప్రియుడి గురించి వాదులాడుకున్నారు. మాటామాటా పెరగడంతో కోపం పట్టలేక ఆ యువతి వెంటతెచ్చుకున్న పిస్టల్ తీసి షిఫా షేక్ పై కాల్పులు జరిపి పారిపోయింది. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో బుల్లెట్ షిఫా షేక్ చెంప గుండా వెళ్లి పుర్రెలో చిక్కుకుంది. స్థానికులు వెంటనే స్పందించి షిఫా షేక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa