ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలుపుపై తారిక్ రహ్మాన్ కి శుభాకాంక్షలు తెలిపిన మోడీ

international |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 11:59 AM

బంగ్లాదేశ్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.గురువారం బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. వెలువడుతున్న అనధికారిక ఫలితాల ప్రకారం 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవలే దేశానికి తిరిగి వచ్చిన తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ పార్టీ 300 స్థానాల పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో ఒక పోస్ట్ పెట్టారు. "బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీని ఘన విజయపథంలో నడిపించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది. ఇరుదేశాల మధ్య బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa