ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2026, 03:28 PM

AP: అవనిగడ్డలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. శిలాఫలకంపై ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం బోర్డును పీకేసి, దానిని పంట కాలువలో పడేసేందుకు ప్రయత్నించారు. వెంకటేశ్వరరావు వర్గాన్ని అవనిగడ్డ టీడీపీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ అడ్డుకున్నారు. పార్టీ కోసం కష్టపడితే కుల వివక్ష చూపుతున్నారని వెంకటేశ్వరరావు వర్గం ఆరోపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa