గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్దగుడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ అష్టబంధన మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం మరియు 59 అడుగుల జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షుడు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి మరియు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa