ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాలి: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 06:12 PM

AP: దేవాలయాల పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపైనే ఉందని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం జరగకుండా చూడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa