శీతాకాల ఒలింపిక్స్-2026లో కండోమ్స్ కొరత ఏర్పడింది. 2900 మంది అథ్లెట్స్ కోసం సిద్ధం చేసిన 10వేల ప్యాకెట్లు కేవలం 3 రోజుల్లోనే ఖాళీ అయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో, విమర్శలు రాకుండా వెంటనే అదనపు స్టాక్ తెప్పిస్తున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఒలింపిక్స్‌లో ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు, అయితే కరోనా సమయంలో వీటికి బ్రేక్ పడింది.ఒలింపిక్ క్రీడా గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది అథ్లెట్లు కొన్ని వారాల పాటు కలిసి ఉంటారు. ఈ క్రమంలో సురక్షితమైన శృంగారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో కోవిడ్ ఆంక్షల కారణంగా సాన్నిహిత్యంపై నిషేధం విధించారు. ప్రస్తుతం ఆ నిబంధనలు లేకపోవడంతో అథ్లెట్ల మధ్య పరస్పర కలయికలు పెరిగాయి. ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన కొత్త స్టాక్ ఆర్డర్ చేసినట్టు ఒలింపిక్ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. క్రీడలు ముగిసే వరకు అథ్లెట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa