మేషం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. మాతృ వర్గ బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృషభం: అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతుంది. ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
మిధునం: ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అవుతుంది. బంధువులు, మిత్రుల నుంచి రుణాలు ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.
కర్కాటకం: గృహమున సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
సింహం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బందు మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
కన్య: దీర్ఘ కాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
తుల: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో ఎంత శ్రమపడిన ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.
మకరం: ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. గృహమును కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కుంభం: చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటారు.
మీనం: బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.