ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు : 18. 04. 2022, సోమవారం

Astrology |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 11:39 AM

తేది : 18, ఏప్రిల్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 10 గం॥ 0 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న ఉదయం 7 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 34 ని॥ వరకు)
యోగము : సిద్ధి
కరణం : తైతిల
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 40 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 10 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 32 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ వరకు)


గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)


యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)


సూర్యోదయం : ఉదయం 5 గం॥ 58 ని॥ లకు


సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 32 ని॥ లకు


సూర్యరాశి : మేషము


చంద్రరాశి : తుల


మేషం
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తిఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది.


అదృష్ట సంఖ్య 3


వృషభం
అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది స్వస్థానమున ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.


అదృష్ట సంఖ్య 2


మిథునం
ముఖ్యమైన విషయాలలో బద్దకించడం మంచిది కాదు కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.


అదృష్ట సంఖ్య 9


 


కర్కాటకం
నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ప్రభుత్వాధికారులు నుండి సమస్యలు కలుగుతాయి ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.


అదృష్ట సంఖ్య 4


సింహం
ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుండిశుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


అదృష్ట సంఖ్య 2


 


కన్య
చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.


అదృష్ట సంఖ్య 1


తుల
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.


అదృష్ట సంఖ్య 3


 


వృశ్చికము
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఉద్యోగమున అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.


అదృష్ట సంఖ్య 5


ధనస్సు
ధన వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.


అదృష్ట సంఖ్య 2


మకరం
వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది సమాజంలో పెద్దలతో సఖ్యత గా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.


అదృష్ట సంఖ్య 2


కుంభం
దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి.


అదృష్ట సంఖ్య 9






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com