మేషం: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృషభం: సన్నిహితులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
మిధునం: నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు సాగుతాయి, వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కర్కాటకం: పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు, మిత్రులతో మాటపట్టింపులు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య: నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
తుల: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతారు.
వృశ్చికం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ధనస్సు: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మకరం: గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ధన వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
మీనం: వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.