మేషం: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి.
వృషభం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మిధునం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం: సన్నిహితుల సహకారంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
సింహం: నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
తుల: కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
వృశ్చికం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.
ధనస్సు: బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారమున బాగస్తులతో సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకరం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
కుంభం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృత మవుతాయి. మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం: కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతాన విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.