ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.బుధవారం జరగాల్సిన పరీక్షను తుఫాన్ కారణంగా ఈ నెల 25కు వాయిదా వేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలన్నివాయిదా వేసినట్టు వార్తలు ప్రసారం అయ్యాయని, కేవలం ఒక పరీక్షమాత్రమే వాయిదా వేశామని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్ధులు ఆందోళన చెందవద్దని, అన్ని పరీక్షలు వాయిదా పడలేదని ఇంటర్ బోర్డు తెలిపింది. మిగతా పరీక్షలు యదాతథంగా జరుగుతాయని, పరిస్థితిని బట్టి వాటి పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.